Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సెప్టెంబర్ 4 నుంచి 10 వరకు బీజేపీ ఎమ్మెల్యే ఆశావహుల దరఖాస్తుల స్వీకరణ

BJP to take MLA applications from Sep 4 to Sep 10
Advertisement
  • దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించిన కిషన్ రెడ్డి నేతృత్వంలోని కమిటీ 
  • నాంపల్లి బీజేపీ కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణ
  • ఉదయం 10 నుండి సాయంత్రం 4 వరకు దరఖాస్తుల స్వీకరణ
Advertisement
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ఆశావహుల నుండి దరఖాస్తులను స్వీకరించనుంది. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికార బీఆర్ఎస్ 119 నియోజకవర్గాలకు గాను 115 మంది అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ఆశావహుల నుండి దరఖాస్తులు స్వీకరించింది.

బీజేపీ కూడా సెప్టెంబర్ 4 నుండి 10వ తేదీ వరకు ఆశావహ అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను చేపట్టనుంది. ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 

దరఖాస్తులను స్వీకరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేతృత్వంలోని కమిటీ నిర్ణయించింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశించేవాళ్లు నాంపల్లి బీజేపీ కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాల్సి ఉంటుంది.
Advertisement
Advertisement
BJP
Telangana
Telangana Assembly Election

More Telugu News